పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వేదా ఆశీర్వచనం అందించిన అర్చకులకు TTD అధికారులు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మంగళవారం పులివెందులలోని మాజీ సీఎం నివాసానికి వెళ్లిన ఎవరిలో ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్‌కుమార్, వీణా మనోజ్‌కుమార్, రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయ సిబ్బంది కె.పార్థసారథిలు ఉన్నారు. తితిదే పరిపాలన అధికారుల నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించారని వారికీ నోటీసులు జారీ చేశారు.
మాజీ సీఎం జగన్ కు శేష వస్త్రం (పీఎస్ దుప్పట), రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలను అందజేసి వేద ఆశీర్వచనం చేయడాన్ని తితిదే ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. మాజీ సీఎం సేవలో తరించిన ముగ్గురు అర్చకులకు బుధవారం నాడు డిప్యూటీ ఈ ఓ ఎ.ప్రశాంతి నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. సకాలంలో స్పందించకపోయినా.. ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా క్రమశిక్షణ చర్యలు తప్పవని అందులో పేర్కొన్నారు.











