చిత్రం : ‘డెకాయిట్’
విడుదల తేదీ : 10-04-2026
నటీనటులు : అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకుడు : షానియల్ డియో
స్క్రీన్ ప్లే : అడివి శేష్
కథ : అడివి శేష్
ఛాయాగ్రహణం : దనుష్ భాస్కర్
కూర్పు : కోదాటి పవన్ కళ్యాణ్
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
నిర్మాతలు : యార్లగడ్డ సుప్రియ, సునీల్ నారంగ్
‘మేజర్’తో అడివి శేష్ జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్నారు. దీంతో ఇప్పుడు ఆయన హీరోగా నటించిన చిత్రం ‘డెకాయిట్’పై ఇటు దక్షిణాదిలోనూ.. అటు ఉత్తరాదిలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించ గలిగిందో మన రివ్యూ లో తెలుసుకుందాం!
కథ : హరిదాస్ (అడివి శేష్) తక్కువ కులస్థుడు. పెద్ద కులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రాణంగా ప్రేమిస్తోంది. ఓ హత్య కేసులో హరి 13 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తుంటాడు. హరి ని ఈహత్య కేసులో ఎవరు ఇరికించారు . ..? సరస్వతి పై పగ తీర్చుకోవాలని ఎందుకు అనుకుంటాడు..?.ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన హరి ని ఆమె ఎందుకు చంపాలనుకుంటుంది . .?హరి మళ్లీ ఆమె జీవితంలోకి వచ్చి ఏం చేశాడు..? చివరకు వీరిద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి..? ఈ కథలో సీఐ స్వామి అలియాస్ రాంబాబు (అనురాగ్ కశ్యప్), కరుణ హాస్పిటల్స్ ఛైర్మన్ (ప్రకాశ్ రాజ్), మల్లి (కామాక్షి భాస్కర్ల) పాత్రలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే…? సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
అడివి శేష్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో బలమైన భరోసా కనిపిస్తుంది. వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమాలో.. పాత్ర పరిస్థితులకు తగ్గట్టు రెండు గెటప్స్ లో చక్కగా నటించి అడివి శేష్ మెప్పించాడు. ముఖ్యంగా తనదైన శైలిలో ట్విస్ట్‌లు, టర్న్‌లు జోడించి ఓ మాస్ యాక్షన్ సినిమాని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. ఇక హీరో ఎప్పుడైతే కథానాయిక జీవితంలోకి తిరిగి ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఈక్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు థ్రిల్ నిస్తాయి. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ మరియు హీరోయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక చివర్లో ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సినిమాను ముగించడం కూడా ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు షానియల్ డియో రాసుకున్న కథను అంతే బలంగా చూపించలేకపోయాడు. కథనంలో ఎన్నో మలుపులు, ట్విస్ట్ లు ఉన్నా అవి అనుకున్న స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేవు. ఓ వైపు నాయకానాయికల్ని వెతికి పట్టుకునేందుకు సీఐ స్వామి రంగంలోకి దిగడం.. వాళ్లని తప్పించుకుని, కథానాయికని పోలీసులకు పట్టించాలని హీరో చేసే ప్రయత్నాలతో ద్వితీయార్ధం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. కాకపోతే ఆ తర్వాత నుంచి కథ కాస్త గాడి తప్పిన అనుభూతి కలుగుతుంది. హీరో చేసే త్యాగం ‘ప్రేయసి రావే’ లాంటి క్లాసిక్ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. కాకపోతే ఆ ముగింపును ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారన్న దానిపై చిత్ర ఫలితం ఆధారపడి ఉంది.
నటీనటులు : అడివి శేష్ మాసీ లుక్స్‌లో హరిదాస్ పాత్రలో తన నటనతో, మదనపల్లి యాసలో సంభాషణలు అన్నీ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. సరస్వతి పాత్రలో మృణాల్ ఆకట్టుకుంటుంది. కళ్లతోనే భావోద్వేగాల్ని పండించింది. సీఐ స్వామిగా అనురాగ్ కశ్యప్, ప్రకాశ్‌రాజ్, సునీల్, కామాక్షి భాస్కర్ల, అతుల్ కులకర్ణి తదితరుల తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం : సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం, బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుంది. పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఛాయాగ్రహణం.. బాగున్నాయి. నిర్మాతలుగా సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా… నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు : మొత్తమీద ‘డెకాయిట్’.. యాక్షన్‌తో ప్రేక్షకుల మనసులు దోచేస్తాడు.
గమనిక : ఈ రివ్యూ అనేది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్.కామ్ : రేటింగ్ : 3/5
రివ్యూ బై : బన్న ప్రభాకర్











