తాండూరు పట్టణంలో ఘోరం జరిగింది. రాష్ట్రం ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎన్నికల శిక్షణకు హాజరైన రాణి అనే ఉపాధ్యాయురాలు వడదెబ్బతో మృతి చెందింది. వడదెబ్బతో బస్టాండ్ లో వాంతులు చేసుకొని కుప్పకూలిపోయింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. ఆమె బషీరాబాద్ మండల కేంద్రంలో టాకి తండాలో ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు