కాషాయ పతాకంగా త్రివర్ణ పతాకాన్ని మార్చాలనుకుంటున్నారు : మెహబూబా ముఫ్తీ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని కాషాయ పతాకంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. జమ్మూకశ్మీర్ కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక జెండాను తొలగించిన విధంగానే… త్రివర్ణ పతాకాన్ని కూడా మార్చేస్తారని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ […]
అమర్‌నాథ్ యాత్రకి వెళ్లిన 35 మంది తెలుగు వారు గల్లంతు..!

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి వరదల్లో గల్లంతైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 35 మందిని సహాయక బృందాలు కాపాడాయి. నెల్లూరు జిల్లా నుంచి మొత్తం 82 మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారని ఆ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. వీరిలో వీరిలో ఇప్పటి వరకు 57 మంది సురక్షితంగా ఉన్నారని, 37 మంది గల్లంతైనారని అయన తెలిపారు. గల్లంతైన వారిలో ఒకరు చనిపోగా.. మరొకరి ఆచూకీ తెలియలేదు. అయితే, చనిపోయిన మహిళ రాజమహేంద్రవరంకు చెందిన గుణిశెట్టి సుధ […]
370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి పర్యటించిన ప్రధాని మోదీ

గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. పాకిస్థాన్ సరిహద్దులోని సాంబా జిల్లాలో రూ.20వేల కోట్లతో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 8.45 కిలోమీటర్ల పొడవున రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్–ఖాజీగంద్ రోడ్డు సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. ఢిల్లీ-అమృత్ సర్-కాత్రా ఎక్స్ ప్రెస్ వేకు ఆయన శంకుస్థాపన చేశారు. పల్లీ గ్రామంలో 500 […]