హడావుడిగా కాకుండా అధ్యయనం చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి : సీఎం కేసీఆర్

మునుగోడు ఉప ఎన్నికపై ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలతో సీఎం కేసీఆర్ వరుసగా భేటీలు అవుతున్నారు. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు, వాటి ఫలితాలను ప్రస్తావిస్తూ.. మునుగోడులో ఎలా ముందుకు సాగాలనే అంశంపై వారు సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్టు తెలిసింది. గతంలోలా హడావుడిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. తాజాగా టీఆర్‌ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, […]