Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నల్ల ధనాన్నిపేద ప్రజల ఖాతాలో ఎందుకు జమ చేయలేదు : గిరీష్ చోదాంకర్

> టి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు నిర్వీర్యం చేసింది,

> మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదు..

> కవిత లిక్కర్ స్కాం నుండి ప్రజల ద్రుష్టి మరల్చడానికే మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం.. 

> లిక్కర్ స్కాం కేసులో  బిఆర్ఎస్ దొంగనాటకాలు.

హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 57 వ డివిజన్ లో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు పాదయాత్ర నిర్వహించారు. గోవా మాజీ పిసిసి అద్యక్షులు గిరీష్ చోదాంకర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. 57 వ డివిజన్ లోని గోకుల్ నగర్ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ చేసి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుండి అశోక కాలనీ సోని బేకరి మీదుగా, అశోక కాలని గాంధీ విగ్రహం వరకు, అలాగే, వికాస్ నగర్, TV టవర్ కాలని, కృష్ణా కాలని, వాజపాయి కాలని, పోచమ్మ గుడి మీదుగా సాగుతూ గోకుల్ నగర్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా పలు కాలనీల ప్రజలు, కాంగ్రెస్ నాయకులకు బ్రహ్మరథం పట్టారు.

ఈ సందర్భంగా గోవా మాజీ పిసిసి అద్యక్షులు గిరీష్ చోదాంకర్ మాట్లాడుతూ…2014 ఎన్నికల సందర్భంగా మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. డిమోనిటైజేషన్ పేరుతో పెద్ద నోట్ల రద్దు ను చేసి నల్ల ధనాన్ని బయటకు తీసి, ఆ డబ్బు పేద ప్రజల ఖాతాలో జమచేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఆ నగదును పేద ప్రజల ఖాతాలో ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేస్తూ… అదాని, అంబానీలకు మోడీ ప్రభుత్వం కట్టబెట్టిందని ఆరోపించారు.

గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్ట్ లు చారిత్రిక కట్టడాలు కట్టమని తెలిపారు. అలాగే, ప్రభుత్వ రంగ సంస్థలను, విశ్వ విద్యాలయాలు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. కానీ, ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమ్మే స్తున్నాయి, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. యూపీఏ 2 ప్రభుత్వం లో నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేశామని తెలిపారు. యూపీఏ దిగిపోయే సమయంలో గ్యాస్ 414, డీజిల్ 55, పెట్రోల్ 71 రూపాయలకు అందుబాటులో ఉండేదని గిరీష్ వివరించారు. కానీ, ఇప్పుడు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా… ప్రతి రోజు పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ సామాన్య మానవును నడ్డి విరుస్తుందని ఘాటుగా విమర్శించారు.

అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణా వస్తే ప్రజల బతుకులు మారుతాయని, బాధలు పోతాయని నమ్మి కేసీఆర్ ను గద్దె ను ఎక్కిస్తే ప్రజలకు పంగనామాలు పెడుతున్నారని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణాలో పేద ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. నిరుద్యోగుల చావులు, రైతుల ఆత్మ హత్యలు, సామాన్య ప్రజల నెత్తిపై అప్పులు మోపుతూ… కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రం కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కమిషన్లపై ఈ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ, రాష్ట్ర అభివృద్ధిపై లేదని నాయిని విమర్శించారు.

లిక్కర్ స్కాం కేసులో బిజెపి బిఆర్ఎస్ దొంగనాటకాలు ఆడుతున్నాయని నాయిని రాజేందర్ అన్నారు. ఇక లిక్కర్ స్కాం నుండి ప్రజల ద్రుష్టి మరల్చడానికే మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని కవిత తెరమీదకు తెచ్చిందని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన కేసిఆర్ ప్రభుత్వంలో ఒక్క మహిళను మంత్రి చేయలేదు రెండో మంత్రివర్గంలో కేవలం ఇద్దిరికి అవకాశం కల్పించి చేతులు దులుపుకున్న చరిత్ర మీ ప్రభుత్వానిది కదా అని ప్రశ్నించారు. కవిత ఎంపి గా ఉన్న కాలంలో పార్లమెంట్ లో మహిళల హక్కుల కోసం ఎన్ని సార్లు తన గళాన్ని వినిపించారని నిలదీశారు.

తనపై లిక్కర్ స్కాం బయటికి రాగానే… మాహిళా సాధికారత కవితకు గుర్తుకు వచ్చిందా? తెలంగాణాకు ఆమె ఏదో స్వాతంత్య్రం తీసుకువచ్చినట్టుగా, తెలంగాణాలో ఆమె ఏమో సాధించినట్టుగా, ఆమెకు జేజేలు పలుకుతున్నారని ఆశర్యం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దేశ సంపదను, చరిత్రను కొల్లగోట్టేందుకే వచ్చాయి తప్ప, ప్రజలకు సేవ చేసేందుకు రాలేదని రెండు ప్రభుత్వాలను తూర్పారబట్టారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్.. అక్కడ మోడీ ఇక్కడ కేడి.. ఇద్దరు తోడు దొంగలేనని, వీరు ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు బంక సతీష్ యాదవ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మాజీ కార్పో రేటర్ నసీం జహాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లలిత, బి. భాగ్యలక్ష్మి, చాముండేశ్వరి, విజయ,బొంత సుజాత, బొల్లు కిషన్, మురళి, రాంమూర్తి,బి. స్వప్న, సరోజ, రాజు, లక్ష్మణ్, బబ్లు నవీన్, శ్రవణ్,జ్యోతి, ఆదిత్య, శంకర్, సతీష్, నాగరాజు, సీనియర్ నాయకులు మహమ్మద్ అంకుష్,M.V రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంబేద్కర్ రాజు,కే.ప్రభావతి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్, NSUI జిల్లా అధ్యక్షుడు పల్లకొండ సతీష్ డివిజన్ అద్యక్షులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news