Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

యూత్ కాంగ్రెస్ నాయకుడి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : కాంగ్రెస్

యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై కక్షపూరితంగా దాడి జరిగిందని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని ఆపార్టీ నాయకులు అన్నారు. బుధవారం కాజిపేట లో ని మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి నాయకత్వంలో వరంగ ల్ పశ్చిమ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్య క్షుడు తోట పవన్ అధికార టీఅర్ఎస్ పార్టీ నాయకుల అవినీతిని ఎండగడుతూ పలు పోరాటాలు చేస్తున్నారని, దానిని జీర్ణించుకోలేని బిఆర్ ఎస్ పార్టీ నాయకులు తోట పవన్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఏఐసీసీ పిలుపుమేరకు టిపిసిసి అధ్యక్షు లు శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం లో హత్ సే హత్ జోడో కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రకు ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తుండటంతో అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టి బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. ఇలాగైతే రాబోయే ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని, ఎలాగైనా హత్ సే హత్ జోడో యాత్రను అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగా ఇటీవల యువజన కాంగ్రెస్ నాయకుడిపై జరిగిన దడి ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.

తెలంగా ణ రాష్ట్రం కోసం విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకుంటుంటే చలించి పోయిన శ్రీమతి సోని యా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు. అది కూడా 16వేల కోట్ల మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు. దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం అయిన తెలంగాణాని చేతగాని ముఖ్యమంత్రి కేసీఆర్   నేడు సుమారు ఐదు లక్షల కోట్ల అప్పుచేసి, ప్రతి పౌ రుడి పై లక్షన్నర అప్పు మోపుతూ… అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే లు, నేటి బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

హన్మకొండలోని  ఏషియన్ మాల్ ప్రక్కన కట్టించిన డబు ల్ బెడ్ రూమ్ ఇళ్లను పేద ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే వినయ భాస్కర్ ఎందుకు పంచడం లేదని పవన్  పోరాడుతున్నాడని, అలాగే, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూ డాలో అవినీతికి పాల్పడుతూ అక్ర మ టెండర్లు చేస్తూ ప్రజాధనం దుర్వి నియోగం చేస్తున్నారని, న్యూ బస్టాం డ్ సమీపంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన విషయాన్ని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దృష్టికి పవన్ తీసుకెళ్లాడని, దానిని జీర్ణించుకోలేని బిఆర్ ఎస్ పార్టీ నాయకులు తోట పవన్ పై దాడి కి దిగారని వివరించారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్  మెప్పు పొంది మరోసారి తెలంగాణ ఉద్యమకారులకుద్రోహం చేసి,  చైర్మన్లు కావాలని అసత్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కూడా చైర్మన్ సుందర్ రాజ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ లు తమ నాయకుడు నాయిని రాజేంద ర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటివి మానుకొని ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని సూచించారు.

కాజీపేట ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తానని, కాజీపేట కడిపికొండ ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర కేటీఆర్ తో శంకుస్థాపన చేయించిన శిలాఫలకం ఎక్కడుందో తెలియపరచాలి ? కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రం ఉద్య మం ఏమైందో? తెలియజేయాలన్నారు. అలాగే, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు నెలకొల్పలేదో తెలియజేయాలన్నారు. కాజిపేట లో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరై ఉన్నది ఇక్కడ నుండి  ఎందుకు తరలిపోయిందో ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకులూ డిమాండ్ చేశారు.

ఈ సమావేశం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకల ఉపేందర్, M V రాజు, ఆరూరి సాంబయ్య, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహమ్మద్ రహమతుల్లా, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు సుధీర్, డివిజన్ అధ్యక్షులు షేక్ అజ్గర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర బాబు రావు, కొండ శివ యాదవ్, కాసు ఇన్నారెడ్డి, క్రాంతి భరత్, గరిగే శివకృష్ణ, షేక్ షాహిద్ అలీ, బొల్లికొండ రవితేజ, తమ్మడి మధు, బిలాల్ తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news