Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఉసిరికాయ (AMLA)తో ఉపయోగాలు :

ఉసిరికాయ  (AMLA) లో ఎన్నో వైద్య గుణాలు కలిగి ఉన్నాయి. కార్తీకమాసం లో మొదలై మార్గశిరమాసం, పుష్యమాసం ( నవంబర్ నుండి ఫిబ్రవరి ) వరకు ఈ కాయలు మార్కెట్ లో బాగా దొరుకుతాయి. కావున వీటిని  తెచ్చుకుని చేసినట్లయితే క్రింద చెప్పిన విధంగా పలు రోగాలను  నయం చేసుకోవచ్చు.  కానీ వీటిని వైద్యుల పర్యవేక్షణలో మంచి ఫలితాలు ఉంటాయి.

ఈ ఉసిరిక రెండు రకములు .1)పచ్చళ్లకు వాడే ఉసిరిక. ఇది జీలగ చెట్టు ఆకుల మాదిరిగా ఈ ఆకులతో ఉంటుంది .కాయలు గుండ్రంగా ఉండి ,తెల్లని చారలు కలిగి ఉంటాయి.
2) తినే ఉసిరిక ,ఇది కొంచం పెద్ద ఆకులను కలిగి ఉంటుంది.దీని కాయలు రేగుపండ్ల సైజులో వుండి పచ్చని రంగులో పుల్లని రుచి కలిగి ఉంటాయి.

ఉసిరికలోని వైద్య గుణాలు :
ఇది పైత్యాన్ని తగ్గిస్తుంది .గుండెకు బలాన్ని కలిగించి మేలు చేస్తుంది .దాహాన్ని అరికడుతుంది .కళ్ళు తిరగటం ,వికారం, కఫ దోషాలు ,నెమ్ము,మూల వ్యాధులు, జలుబు వీనిని తగ్గిస్తుంది, బుద్ధిబలాన్ని,తేజాన్ని పెంచుతుంది. లివారును బలపరుస్తుంది . మధుమేహాన్ని తగ్గిస్తుంది .సుఖ వ్యాధులు ,గర్భాశయ వ్యాధులు రక్తస్త్రావాలకు అద్భుతంగా పని చేస్తుంది.

ఉసిరికతో వైద్యోపయోగాలు :
1) అతిసార విరేచనములకు :::—-ఉసిరికాయ ముక్కలు 20grm తీసుకొని దానిలో 10grm, అల్లముక్కలు కలిపి తగినన్ని మంచి నీటితో మెత్తగా నూరి,ఆ ముద్దను ఒక పల్చని నూలు బట్టలో కట్టి ఆ బట్టను నాభి పైన(బొడ్డు పైన)పెట్టి వేరొక గుడ్డతో కట్టు కట్టి ఉంచితే అతి త్వరగా తీవ్రమైన అతిసార విరేచనాలు తగ్గిపోతాయి ..

2) ఎక్కిళ్ళకు:::—ఉసిరిక కాయల పొడి 10grm ,దొరగ వేయించిన పిప్పళ్ళ పొడి 3 grm , కలిపి రోజు లేదా రెండు లేక మూడు పూటలా సేవిస్తుంటే తీవ్రమైన ఎక్కిళ్ళు సమసిపోవును .

3) మూత్ర కృచ్చము(మూత్రం లో మంట)కు::—పచ్చి ఉసిరిక రసమైతే 1/2కప్పు, లేక ఎండు ఉసిరిక బెరడు కషామైతే కప్పు మోతాదుగా గ్రహించి,దానిలో రెండు గ్రా””ల యాలకుల పొడిని వేసి ,రెండు పూటలా సేవిస్తుంటే,మూత్రంలో మంటపోయి,మూత్రము ఆగి ఆగి రావటం మొదలయిన మూత్ర సమస్యలు నివారించబడతాయి .

4)  స్త్రీల సోమరోగము (తెల్ల బట్ట)కు;—పచ్చి ఉసిరికాయల రసం 1–2 కప్పు ,లేదా ఎండు ఉసిరిక కాయల కషాయం 1 కప్పు ,దానిలో బాగా పండిన అరటి పండు ఒకటి.దానిలో తేనె 1చెంచా వేసి,మొత్తం పదార్థన్ని మెత్తగా లేహ్యంగా కలిపి, దానిలో 3 చెంచాల కలకండ పొడిని వేసి,రోజు మూడు పూటలా ఆ పదార్థాన్నీ మూడు భాగాలుగా చేసి,పుటకొక భాగం తింటుంటే మూడు నుండి ఏడు రోజులలో సోమరోగము పూర్తిగా తగ్గిపోతుంది.

5) నేత్ర రోగములకు👀::–ఒక గ్లాసు నీటిలో 10ఎండు ఉసిరిక ముక్కలను వేసి ఉదయం వరకు (రాత్రి అంతనానబెట్టిన)ఆ నీటిని సగం మిగిలేవరకు మరగ బెట్టి ,వడపోసి చల్లార్చి ఆ పరిశుభ్రమైన ఉసిరిక కషాయంతో మూసిన కన్నులను పైపైన మృదువుగా కడుగుతుంటే క్రమంగా సమస్త నేత్ర రోగాలు హరించి పోతాయి. కంటికి ఎంతోమేలు జరుగుతుంది.

6) స్త్రీల యోని మంటకు, దురదలకు, పోటుకు::—పైన తెలిపిన విధంగా పచ్చి ఉసిరిక రసంలో గాని,ఎండు ఉసిరిక కషాయంలో గాని ఒక చెంచా మంచి తేనె,ఒక చెంచా కలకండను కలిపి,రోజు రెండు పూటలా తింటుంటే స్త్రీలకు యోనిలో కలిగే బాధలు తగ్గిపోతాయి.

7) కడుపులోని అల్సర్ పుండ్లకు ::—ఎండిన ఉసిరిక బెరడు 20గ్రాం, పాత బెల్లం20గ్రా”,తీసుకొని ఆరెంటిని కొంచెము నలగగొట్టి1/2లీటరు మంచి నీటిలో వేసి 1/4లీటరు మిగిలేవరకు చిన్న మంటపై మరిగించి ,దించి వడపోసి చల్లార్చి రెండు పూటలా యీ విధంగా త్రాగుతుంటే అల్సరు పుండ్లు అదృశ్యమైపోతాయి .

8) రక్త పిత్త రోగములకు::–రక్తములో ఉష్ణ స్వభావమెక్కువచేరి ,అది శరీరమంతా వ్యాపించి, శరీరం పై మంటలు ,కళ్ళ మంటలు, అరచేతులు,అరికాళ్ళ మంటలు ,అతి దాహం మొదలైన సమస్యలు కలుగుతాయి. ఒక కప్పు తీయని పెరుగులో 1 చెంచా ఉసిరిక కాయల పొడి కలిపి రెండు లేక మూడు పూటలా అవసరాన్ని బట్టి సేవిస్తుంటే రక్త పిత్తము అనిగిపోతుంది .

9) మధుమేహమునకు ::–మధుమేహ రోగికి ఉసిరిక పండ్ల రసము లేదా ఎండ బెట్టిన చూర్ణములో పసుపు కలిపి తేనెతో ఇచ్చిన(సుమారు గ్రా”.)చొప్పున మధుమేహము తగ్గును .

10) మూత్రబంధమునకు ::—ఉసిరిక కాయల చూర్ణమును బెల్లముతో ఇచ్చిన మూత్రము జారియగును .

11) తెల్లబట్ట వ్యాధికి::–ప్రదర వ్యాధియందు ఉసిరిక కాయల చూర్ణమును చక్కెర లేదా తేనెతో గాని బియ్యం కడుగు నీటితో గాని ఇచ్చిన తగ్గును.

12) నేత్ర వ్యాధులకు 👀::–ఉసిరిక చూర్ణమును ప్రతిరోజు ఇచ్చిన నేత్రవ్యాధులు తగ్గును.

13) త్రిఫల (కరక–తాని–ఉసిరి) సమపాళ్ళలో కలిపి చూర్ణము చేసి. ప్రతిరోజు వాడుతుంటే సర్వ వ్యాధులు సూర్యకిరణాలకు మంచు కరిగినట్లు నశించిపోవును.

14) ఉసిరికాయలు, చూర్ణము మగతనాన్ని పెంచుతుంది. బి.పి ని కంట్రోలు చేస్తుంది .స్త్రీలలో కలిగే మలబద్దకం ను పోగొట్టి ఋతు రక్తాన్ని జారీ చేస్తుంది.మేధా శక్తిని పెంచి, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

పూర్తి వివరాలకు…..  ఖాదర్ చిరాయుష్ 9980609030, 9859555999 సంప్రదించ గలరు.

RSS
Follow by Email
Latest news