Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అయన ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఎంతో అభివృద్ధి చెందుతుంది : రాంబాబు

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎక్క్యూటివ్స్ యూనియన్ అధ్యక్షుడుగా ఇటీవల ఎన్నికైన పి ఎస్ ఎన్ దొర కి శుభాకాంక్షలు తెలిపిన సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్.రాంబాబు. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎక్క్యూటివ్స్ యూనియన్ ఆఫీస్ లో ఫెడరేక్షన్ నాయకులు వల్లభనేని అనిల్ గారు, సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకారం సందర్భంగా సినీ పబ్లిసిటీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ: విక్రమ్ రమేష్, ట్రెజరర్ ఎ.ఈశ్వర్ తో కలిసి అభినందనలు తెలియచేశారు.

ఈ సందర్బంగా రాంబాబు మాట్లాడుతూ… మన ఫెడరేషన్ లో ఎవరికీ ఏ ఇబ్బందులు వచ్చినా… అన్నా.. అంటే నేనున్నా… అని అందరిని అక్కున చేర్చుకునే పి ఎస్ ఎన్ దొర అధ్యక్షులు ఎన్నిక కావడం చాల సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి మనసున్న మారాజు దొర అధ్యక్షులుగా ఉంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరెంతో అభివృద్ధి చెందుతున్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest news