తిరుమలలో నేటి నుండి ప్లాస్టిక్ నిషేధం విధించడంతో…తిరుమలకు వచ్చే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తుండటంతో అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దింతో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చెక్ పోస్ట్ వద్ద వాహనాల చెకింగ్ లో భాగంగా రెండు గంటల పైనే సమయం పడుతుంది. వాటర్ బాటిల్స్ అనుమతి లేదని, కొండపైకి వాటర్ బాటిల్స్ ని తీసుకెళ్లినివ్వడం లేదు. దింతో ఎండలో దాహార్తి తీర్చుకోవడానికి భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
