చేనులో గొర్రెలు పడ్డాయని భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లో గొర్రెల కాపరి పిడుగు కొమురయ్య ను హత్య చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో అయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హత్యలు హత్యాచారాలు, అరాచకాలు, .దౌర్జన్యాలు పెట్రేగిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోక పోవడంతో ప్రతిరోజు నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అసైన్డ్ ప్రభుత్వ భూములు గుట్టల లో పశువులను గొర్రెలను మేపుకోడం కొసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జీవో559. జీవో 1016 లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని అన్నారు. గొర్రెల కాపరి కొమరయ్య ని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఐలయ్య డిమాండ్ చేశారు.
