ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. కేంద్రంలోని బీజేపీ వ్యవహారశైలి, పాలనపై గత కొంతకాలంగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ పాలనలో దేశం నాశనమైపోయిందని కేసీఆర్ బీజేపీపై ఒంటికాలుతో పైకి లేస్తున్నారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అవసరమని చాలా కాలంగా చెపుతూ వచ్చారు. చివరకు జాతీయ పార్టీని స్థాపించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. జాతీయ పార్టీకి మూడు పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి, భారత నిర్మాణ సమితి, భారత ప్రజా సమితి పేర్లను ఆయన పరిశీలిస్తున్నారు. వీటిలో ఒక పేరును ఆయన ఖరారు చేయనున్నారు.
