Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వీరే …?

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపిక విషయంలో నిమగ్నమైనారు. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ సైతం అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తొలి జాబితా ను అయన సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవలే సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావులతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం 119 నియోజక వర్గాలకుగాను మొదటి విడత 74 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలిసింది. మరో 45 నియోజక వర్గాలకు ఎవరైతే గెలుపు సాధిస్తారు అనే కోణంలో అభ్యర్థులను ఫైనల్ చేయాల్సిఉంది. అయితే ఆయా నియోజక వర్గాల్లో అభ్యర్ధులు ఎవరనేది పార్టీ వర్గాల్లో, అలాగే స్థానికంగా టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ 73 నియోజక వర్గాల్లో ఒక్కొక్కరి పేరునే సెలక్ట్ చేశారు. కానీ కోరుట్ల నియోజకవర్గం లో మాత్రం ఇద్దరి పేర్లను~` ప్రకటించారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు ఫైనల్ కానుందని సమాచారం.

జిల్లాల వారీగా :

ఉమ్మడి ఆదిలాబాద్ : జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నదా అందులో ఏడు స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది.

👉 చిల్పూర్ కాగజ్ నగర్ నుంచి కోనేరు కోనప్ప

👉 చెన్నూరు నుంచి బాల్క సుమన్

👉 ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు

👉 ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న

👉 బోధ్  నుంచి బాబురావు రాథోడ్,

👉 నిర్మల్ నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

👉 ముధోల్ నుంచి గడ్డి గారి విట్టల్ రెడ్డి.

ఉమ్మడి నిజామాబాద్ : జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నగా అందులో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

👉 ఆర్మూర్ నుంచి ఆశన్న గారి జీవన్ రెడ్డి

👉 బోధన్ నుంచి షకీలా అహ్మద్

👉 జుక్కల్ నుంచి హనుమంత్ షిండే

👉 బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్రెడ్డి

👉 ఎల్లారెడ్డి నుంచి జాజుల సురేందర్

👉 నిజామాబాద్ అర్బన్ నుంచి గణేష్ బిగాలా

👉 నిజామాబాద్ నూరర్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి

👉 బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి,

ఉమ్మడి కరీంనగర్ : జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

👉 కోరుట్ల నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు లేదా కల్వకుంట్ల సంజయ్ ఇద్దరిలో ఎవరిని ఒకరిని ఫైనల్ చేస్తారు.

👉 జగిత్యాల నుంచి సంజయ్ కుమార్

👉 మంథిని  నుంచి పుట్ట మధు

👉 కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్

👉 సిరిసిల్ల నుంచి కల్వకుంట్ల తారక రామారావు

👉 మానకొండూరు నుంచి రసమయి బాలకిషన్

👉 హుస్నాబాద్ నుంచి ఒడిదల సతీష్ కుమార్

👉 రామగుండం నుంచి కోరుకంటి చందర్.

ఉమ్మడి మెదక్ : జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.

👉 సిద్దిపేట నుంచి తన్నీరు హరీష్ రావు

👉 నారాయణఖేడ్ నుంచి మహి రెడ్డి భూపాల్ రెడ్డి

👉 నర్సాపూర్ నుంచి తిరుమల మధున్ రెడ్డి

👉 పటాన్ చెరువు నుంచి గూడెం మహిపాల్ రెడ్డి

👉 దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి

👉 గజ్వేల్ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర రావు

ఉమ్మడి రంగారెడ్డి : జిల్లా నుంచి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో 12 నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించారు.

👉 మేడ్చల్ నుంచి సిహెచ్ మల్లారెడ్డి

👉 మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు

👉 కుత్బుల్లాపూర్ నుంచి కెపి వివేకానంద

👉 కూకట్ పల్లి నుంచి మాధవరం కృష్ణారావు

👉 ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి

👉 లాల్ బహుదూర్ నగర్ నుంచి దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

👉 మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి

👉 రాజేంద్రనగర్ నుంచి తొలకంటి ప్రకాష్ గౌడ్

👉 శేర్లింగంపల్లి నుంచి హారికపూడి గాంధీ

👉 చేవెళ్ల నుంచి కాలే యాదయ్య

👉 వికారాబాద్ నుంచి డాక్టర్ ఆనంద్ మెతుకు

👉 తాండూరు నుంచి పైలెట్ రోహిత్ రెడ్డి

ఉమ్మడి హైదరాబాద్ : జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.

👉 ముషీరాబాద్ నుంచి ముఠాగోపాల్

👉 అంబర్ పేట నుంచి కాలేరు వెంకటేశం

👉 ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్

👉 జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్

👉 సనత్ నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్

👉 కింద్రాబాద్ నుంచి పద్మారావు

👉 గోషామహల్ నుంచి ఆశిష్ కుమార్ యాదవ్

ఉమ్మడి మహబూబ్ నగర్ : జిల్లాల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించారు.

👉 కొడంగల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి

👉 నారాయణపేట నుంచి ఎస్ రాజేందర్ రెడ్డి

👉 మహబూబ్నగర్ నుంచి వి శ్రీనివాస్ గౌడ్.

👉 జడ్చర్ల నుంచి లక్ష్మారెడ్డి

👉 దేవరకద్ర నుంచి ఆల వెంకటేశ్వర్ రెడ్డి

👉 మక్తల్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డి

👉 వనపర్తి నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

👉 గద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

👉 నాగర్ కర్నూల్ నుంచి మర్రి జనార్దన్ రెడ్డి

👉 కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి.

ఉమ్మడి నల్గొండ : జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.

👉 దేవరకొండ నుంచి రామావతు రవీంద్ర కుమార్

👉 మిర్యాలగూడ నుంచి నల్లమోతు భాస్కరరావు

👉 హుజూర్నగర్ నుంచి శానంపూడి సైదిరెడ్డి

👉 సూర్యాపేట నుంచి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

👉 నల్గొండ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి

👉 భువనగిరి నుంచి పైల శేఖర్ రెడ్డి

👉 నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య

👉 తుంగతుర్తి నుంచి గాదరి కిషోర్ కుమార్

👉 ఆలేరు నుంచి గొంగిడి సునీత

👉 మునుగోడు నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఉమ్మడి వరంగల్ : జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గం అందులో ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.

👉 పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు

👉 నర్సంపేట నుంచి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి

👉 పరకాల నుంచి చల్ల ధర్మారెడ్డి

👉 వరంగల్ పశ్చిమ నుంచి దాస్యం వినాయభాస్కర్

👉 వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్

👉 భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి

ఉమ్మడి ఖమ్మం : జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నగా అందులో ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.

👉 పినపాక నుంచి రేగకాంతారావు

👉 ఇల్లందు నుంచి బానోతు హరిప్రియ

👉 ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్

👉 సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య

👉 అశ్వరావుపేట నుంచి మెచ్చ నాగేశ్వరరావు.

RSS
Follow by Email
Latest news