Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

పశు మిత్రులకు కనీస వేతనం నిర్ణయించే వరకు పోరాటం ఆపేది లేదు : ఎడ్ల రమేష్

పశు మిత్రులకు కనీస వేతనం నిర్ణయించే వరకు పోరాటం ఆపేదే లేదని తెలంగాణ రాష్ట్ర పశు మిత్రల వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండల పశు మిత్రల సమావేశం అనూష అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పశుమిత్ర వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుండి వార్డు మెంబర్ వరకు, ఐఏఎస్ నుండి సఫాయి కార్మికుడి వరకు వేతనాలు ఉన్నాయి. వేతనాలు లేని ఏకైక వ్యక్తులు పశు మిత్రలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2500 మంది పసుమిత్రులు గత ఎనిమిది సంవత్సరాల నుండి పల్లెల్లో మూగజీవాలకు ఉచితముగా వైద్య సేవలు అందిస్తున్నారని వివరించారు. రైతులకు, మూగజీవాలకు ఆర్ధిక, అరోగ్య రక్షణ కల్పిస్తూ వెట్టి చాకిరి చేస్తున్న వారే పసమిత్రులు. . మహిళా పక్షపాతి అని ప్రగల్ బాలు పలికే BRS ప్రజాప్రతినిధులు 2500 మంది మహిళలతో 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకోవడం చాలా అన్యాయం అన్నారు.

దేశానికి మార్గదర్శకం గా ఉన్నామని భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రభుత్వం తన దగ్గరనే వెట్టిచాకిరి చేసే ఆడపడుచులు ఉన్నారన్న విషయము తెలియదా? లేక తెలిసి నటిస్తున్నావా అని ప్రశ్నించారు. మార్చి 11వ తేదీన ఉద్యమ కార్యచరణ ప్రకటించి కనీస వేతనం సాధించేవరకు పోరాడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా   ప్రభుత్వం వెంటనే పశుమిత్రులందరికీ జీవో 60 ప్రకారం 15,600 కనీస వేతనం నిర్ణయం చేయాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు, యూనిఫామ్స్ వెంటనే మంజూరు చేయాలని రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సైథపూర్ మండల నాయకులు అనూష, శారద, స్వర్ణ లత, స్వప్న, మమత, రజిత, సరోజన, శ్రీవిద్య, రేణుక, వనజ తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news