Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

భారీ పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన పోలీసులు

దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల కుట్రను ముందే పసిగట్టిన పోలీసులు వారి కుట్రలను  భగ్నం చేసారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. పంజాబ్లోని హరియాణా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు నలుగురాణి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బాంబులు, బుల్లెట్లు, గన్‌పౌడర్‌ తదితరాలను తరలిస్తుండగా వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు దేశ సరిహద్దులకు ఆవల నుంచి డ్రోన్ల ద్వారా తీసుకువచ్చినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది

ఈ మేరకు తెలంగాణ, పంజాబ్, హర్యానా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. వారికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. వారు ఆయుధాలను తెలంగాణ, మహారాష్ట్ర తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అరెస్టయిన ఉగ్రవాదులు పర్మిందర్, గురుప్రీత్, భూపేంద్ర, అమన్ దీప్ గా గుర్తించారు. వీరికి పాకిస్థాన్ లో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాది హర్జీందర్ సింగ్ ఈ ఆయుధాలు పంపినట్టు సమాచారం.

RSS
Follow by Email
Latest news