Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నానక్ రామ్ గూడ కు తరలనున్న యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం..

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాదులో ఏర్పాటైన యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం మరో చోటికి తరలిపోతోంది. ప్రస్తుతం యూఎస్ కాన్సులేట్ కార్యాలయం బేగంపేటలోని పైగా ప్యాలెస్ లో ఉంది. సర్వే నెం.115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, హైదరాబాద్, తెలంగాణ-500032. ఇదే తమ కొత్త అడ్రస్ అని అమెరికా దౌత్య వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే  ఈ తరలింపు నేపథ్యంలో, ఈ నెల 15 నుంచి 20వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు కాన్సులేట్ సేవలు అందుబాటులో ఉండవని అమెరికా దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఈ నెల 15 వరకు బేగంపేట్ లోని పాత కార్యాలయంలో తమ సేవలు అందుబాటులో ఉంటాయని, 20 నుంచి నూతన కార్యాలయంలో తమ సేవలు అందుబాటులో ఉంటాయని అమెరికా దౌత్య వర్గాలు తెలిపారు.

RSS
Follow by Email
Latest news