Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య పోరు…

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పోరు తారాస్థాయికి చేరింది. దేశ అత్యున్నత స్థానంమైన సుప్రీంకోర్టుకు చేరింది. తాము ప్రతిపాదించిన 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచారని తెలంగాణ సర్కారు ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ లో ప్రతివాదిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను పేర్కొన్నారు. గత సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు 10 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఆ బిల్లులను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

పెండింగ్ లో ఉన్న బిల్లులు…

అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లు, అటవీ వర్సిటీ అప్ గ్రేడ్ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, అగ్రికల్చరల్ యూనివర్సిటీ సవరణ బిల్లు, మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.

RSS
Follow by Email
Latest news