*దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ – 1: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి శ్రీ మహమూద్ అలీ*
*- చేవెళ్లలో ఆధునిక పోలీస్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ అంజని కుమార్, ఐపిఎస్.,*
*- ఫ్రెండ్లీ పోలీస్,శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్*
*- రాష్ట్ర ప్రజలకు పోలీస్ శాఖ మెరుగైన సేవలందించాలి*
*- షీ టీంల మరియు భరోసా సెంటర్ల ఏర్పాట్ల ద్వారా మహిళాల కు భద్రత*
*- రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ*
ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందంజలో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ పోలీలు ఫ్రెండ్లీ పోలీస్,శాంతి భద్రతలే లక్ష్యంగా పని చేస్తున్నారని వారిని మెచ్చుకున్నారు.
రంగారెడ్డి జిల్లా లోని చేవెళ్ళ నియోజకవర్గ పరిధిలో చేవెళ్ళ టౌన్ లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని ఈరోజు హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్, ఐపీఎస్., చేవెళ్ళ ఎంపీ డా.రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ శ్రీ పి.మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ సురభి వాణీదేవి, రంగారెడ్డి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ శ్రీ టి. అనిత హరినాథ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తదితరులతో కలిసి ప్రారంభించారు.
అలాగే ఇదే రోజున రంగారెడ్డి జిల్లా లోని షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలో నందిగామ లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని ఈరోజు హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్, ఐపీఎస్., మహబూబ్ నగర్ ఎంపి మన్నే శ్రీనివాస్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రంగారెడ్డి జిల్లా జెడ్పి చైర్ పర్సన్ శ్రీ టి. అనిత హరినాథ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తదితరులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని కితాబు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రాష్ట్రంలో ఐటీ, సైబర్ నేరాలను అరికడుతున్నట్టు తెలిపారు. ఎప్పుడు లేని విధంగా 33 శాతం మహిళా సిబ్బంది పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని కొన్ని మండలాలలో పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యను పరిష్కరిస్తామని స్థానిక ఎమ్మెల్యే కు పోలీస్ శాఖకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ అంజనీ కుమార్, ఐపిఎస్., మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ లా & ఆర్డర్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇందుకు నిదర్శనం పోలీస్ శాఖకు అత్యధిక నిధులు కేటాయించారు. ఎక్కడైతే శాంతిభద్రతలు బాగుంటాయో అక్కడికే పెట్టుబడులు ఎక్కువగా వస్తాయని తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశానికే రోల్ మోడల్ అన్నారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే Dial 100 కు ఫోన్ చేసిన వెంటనే తక్షణమే పోలీసులు స్పందిస్తారన్నారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ ను అత్యాధునిక హంగులతో నిర్మించామాన్నారు.
అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో నేరాలను నియంత్రించడంలో తెలంగాణ పోలీసులు పూర్తిగా విజయవంతమయ్యారన్నారు. దేశంలో ఎక్కడా లేని భద్రత మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొనసాగుతుందని, ఏడు లక్షల సిసిటీవీల నిఘా ఒక హైదరాబాదులోనే కొనసాగడం గర్వకారణమన్నారు. దేశంలోనే 63% సీసీ ఫుటేజీలు మన రాష్ట్రంలోనే పనిచేస్తున్నాయని, అమెరికను తలపించే విధంగా హైదరాబాద్ ఏర్పాటు కావడం చాలా సంతోషకరమమన్నారు.
అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య మాట్లాడుతూ.. చేవెళ్ల లో నూతన పోలీసు స్టేషన్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలంగాణ పోలీసులు దేశంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెరుగైన పోలిసింగ్ కోసం ప్రభుత్వం పోలీస్ శాఖకు పోలీసు భవనాలు, వాహనాలు, మ్యాన్ పవర్, వెల్ఫేర్ తదితర సహాయసహకారాలు అందిస్తుందన్నారు. సైబరాబాద్ పరిధిలోని మొయినాబాద్ శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పునరుద్ధరణతో పాటు పోలీస్ క్వార్టర్స్లు కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నిర్మించాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి శ్రీ మహమూద్ అలీ, చేవెళ్ళ ఎంపి డా.జి. రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య, ఎమ్మెల్సీ శ్రీ పి.మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ వాణీదేవి, శ్రీ టి. అనిత హరినాథ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు సున్నపు వసంతం, గుండాల రాములు, సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.
అలాగే పోలీస్ శాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర డిజిపి శ్రీ అంజని కుమార్, ఐపిఎస్., సైబరాబాద్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., జాయింట్ సీపీ శ్రీ అవినాష్ మహంతి, ఐపిఎస్., ట్రాఫిక్ జాయింట్ సీపీ శ్రీ నారాయణ నాయక్, ఐపీఎస్., డిసిపి రాజేంద్రనగర్ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఏడిసిపి రాజేంద్రనగర్ శ్రీ సాధన రష్మి పెరుమాళ్, ఐపిఎస్.,నార్సింగి ఏసీపీ రమణ గౌడ్, ఏసీపీ రాజేంద్రనగర్ గంగాధర్, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరులు, నార్సింగి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివకుమార్, షాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గురువయ్య, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మి రెడ్డి, శంకర్పల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.