Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఈ నెల 6 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. గత బడ్జెట్ సెషన్ తర్వాత స్పీకర్ సభను సభను ప్రోరోగ్ చేయకుండా సభను  వాయిదా వేశారు. అసెంబ్లీ, మండలి సమావేశాలు మార్చి 7న ప్రారంభమై మార్చి 15న ముగిసిన బడ్జెట్ సెషన్‌కు కొనసాగింపుగా ఉండనున్నాయి. 6 వ తేదీ ఉదయం 11.30 కు ఈ సమావేశాల తొలి సెషన్ మొదలు కానుంది. అదేరోజు తెలంగాణ బీఏసీ సమావేశం కూడా జరగనుంది.

ఈ నెల మూడో తేదీన జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే రోజు సాయంత్రం తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలతోపాటు దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టిఆర్ఎస్ అనుసరించనున్న పాత్రపై సిఎం కెసిఆర్‌ దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది.

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించిన విషయం తెలింసిందే. ఈ ఘటనపై అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విపక్షాలు ప్రశ్నించే అవకాశముంది. వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం బిజెపి శాసనసభా పక్షనేత రాజాసింగ్‌పై పీడీయాక్ట్  నమోదు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా కేంద్రంలోని బిజెపి తీరును రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎండగట్టే అవకాశం ఉంది.

RSS
Follow by Email
Latest news