Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో పోరాడుతున్న టీం ఇండియా

కేప్ టౌన్ లో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా ముందు భారీ లక్ష్యం నిలిచింది.  టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఓపెనర్ బెత్ మూనీ 54, కెప్టెన్ మెగ్ లానింగ్ 49 (నాటౌట్), ఆష్లే గార్డనర్ 31, అలీసా హీలా 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శిఖా పాండే 2, దీప్తి శర్మ 1, రాధా యాదవ్ 1 వికెట్ తీశారు.

ఇక, 173 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ కు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి.ప్రస్తుతం భారత్ స్కోరు 10 ఓవర్లలో 3 వికెట్లకు 93 పరుగులు కాగా… హర్మన్ ప్రీత్ 33, జెమీమా రోడ్రిగ్స్ 39 పరుగులతో ఆడుతున్నారు.

స్టార్ ఓపెనర్ స్మృతి మంధన 2, యువ బ్యాటర్ షెఫాలీ వర్మ 9 పరుగులకే వెనుదిరిగారు. వన్ డౌన్ లో వచ్చిన యస్తికా భాటియా 4 పరుగులు చేసి రనౌట్ అయింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ జట్టును ఆదుకున్నారు.

RSS
Follow by Email
Latest news