- బెంగళూరు తరలివెళ్లిన నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు…
- లోకేశ్ పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు..
- కుప్పం ఆసుపత్రి నుంచి అర్ధరాత్రి బెంగళూరు తరలింపు…
- నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్న తండ్రి మోహనకృష్ణ…
- కాసేపట్లో బెంగళూరుకు చంద్రబాబు…
నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న నిన్న సొమ్మసిల్లి పడిపోగా, వెంటనే ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. గత రాత్రి తారకరత్నను మెరుగైన వైద్యం కోసం కుప్పం నుంచి బెంగళూరు తరలించారు.
ప్రస్తుతం తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స జరుగుతోంది. తారకరత్న తండ్రి మోహనకృష్ణ ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బెంగళూరు ఆసుపత్రికి చేరుకోనున్నారు.
ఇప్పటికే నందమూరి కుటుంబసభ్యులు.. పురందేశ్వరి, నందమూరి సుహాసిని తదితరలు బెంగళూరు చేరుకున్నారు. అలాగే, టీడీపీ నేతలు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, పరిటాల శ్రీరామ్ ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. ఈక్రమంలో నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద భారీ పోలీసులను మోహరించారు.