తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రాజశేఖర్ కుటుంబం :

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్, జీవిత, శివానీ, శివాత్మిక అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రాజశేఖర్ కుటుంబం సాంప్రదాయక దుస్తులు ధరించి తిరుమల మెట్ల మార్గం గుండా కాలినడకన కొండపైకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుని, మొక్కులు తీర్చుకున్నారు. రాజశేఖర్, జీవిత, శివానీ, శివాత్మిక అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి చేరుకున్నారు. అయితే వారు సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.