భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దింతో భద్రాచలం వద్ద మూడో ప్రమాదకర హెచ్చరికను జారీ చేశారు. తెలంగాణలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మధ్య రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఎగువన మహారాష్ట్రలో మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో గోదావరి నదికి వరద పోటెత్తడంతో పలు ఆలయాలు నీటమునిగాయి. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు […]