Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బన్నీవాసు తనను మోసం చేశాడని గత కొంతకాలంగా ఆరోపిస్తున్న సునీత బోయ గతంలో పలుమార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. తాజాగా, గత రాత్రి మరోమారు కార్యాలయం వద్దకు చేరుకుని నగ్నంగా బైఠాయించింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్ మహిళా పోలీసులు ఆమె  ఒంటిపై దుస్తులు కప్పి ఆమెకు నచ్చజెప్పారు.

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ తనకు నెలవారీ ఖర్చులకు కొంత ఇబ్బందిగా ఉందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. బన్నీ వాసు ప్రస్తుతం ఇతర ప్రాంతంలో షూటింగులో ఉన్నాడని, వచ్చాక మాట్లాడతామని చెప్పిన పోలీసులు ఆమెకు కొన్ని డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. కాగా, గతంలోనూ పలుమార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద సునీత ఆందోళన చేసింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని చెబుతూ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఆమెను అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest news