Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే కఠిన శిక్ష : ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి రాధాదేవి

హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్ట్ లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో  నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కాజీపేట వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి రాధాదేవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ ఎంపిక 1994 చట్టం 1996 రూల్స్ ప్రకారం అనుసరించి విధి విధానాలపై గైనకాలజిస్ట్ లకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈసందర్బంగా జడ్జి రాధాదేవి మాట్లాడుతూ… లింగ నిర్ధారణ చేయడం అనేది చట్టరీత్య నేరమని అన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాలు పడితే, లింగ నిర్ధారణ చేపడితే, అబార్షన్లు చేసిన వైద్య అధికారుల పైన, ఆస్పత్రుల పైన, ప్రోత్సహించిన వారికి, బంధువులకు, కఠినమైన శిక్షలు ఉంటాయి డిస్టిక్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ హెచ్చరించారు. సమాజం లో, ఆడపిల్లల, ఆవశ్యకత పైన అవగాహన తప్పనిసరిగా పెంపొందించాల్సిన అవసరం ఉందని, సమాజంలో ఆడైనా మగైనా సమాన హక్కులు కల్పించాలని, బంధువులు తల్లిదండ్రులు మళ్లీ ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రులు ఆశ్రయించిన గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించాలని, రేపటి తరానికి ఆడపిల్ల ఎంతో అవసరమని, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలు రాణిస్తున్నారని, అందుకోసం బృహన హత్యలను పూర్తిగా వ్యతిరేకించాలని వైద్యులకు సూచించారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ, సమాజంలో ఆడపిల్ల ఆవశ్యకత పైన ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే అన్ని మండల స్థాయిలో ఇదే విధమైన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆడపిల్లల పైన పూర్తిగా వివక్షత చూపకూడదని, మగ పిల్లవానితో పాటు ఆడపిల్లకు సమాన హక్కులతో పై చదువులు చదివించాలని తల్లిదండ్రులను కోరారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో, స్కానింగ్ సెంటర్లో, లింగ వివక్షేత, మరియు పిసిపి అండి యాక్ట్ సంబంధించిన గైడ్ను లైన్లను విధిగా ప్రదర్శించే విధంగా వైద్య ఆరోగ్యశాఖ తోడ్పడాలని ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్య అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

సీపీ రంగనాథ్ మాట్లాడుతూ, జిల్లాలో ఆస్పత్రులపైన గతంలో ఎన్నోసార్లు దాడులు నిర్వహించామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆస్పత్రులను వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి గుర్తించి, వారి పైన కఠిన చర్యలు చేపట్టడంతో పాటు, జరిమానా విధించి, జైలు పంపించడం జరిగిందని పేర్కొన్నారు, ఇప్పటికీ మా వద్ద ఉన్న సమాచారం మేరకు ఆర్ఎంపీలు హోమియో వైద్యులు ఇతర ప్రైవేటు వైద్యుల సహాయంతో లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు సమాచారం ఉందని, చట్టం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరని ఇకనైనా భృణ  హత్యలు చేపట్టకూడదని ఆసుపత్రి యజమాన్యానికి హెచ్చరికాలు జారీ చేశారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకటరమణ జిల్లాలో ఉన్న స్కానింగ్ సెంటర్లు 102 ఉండగా అందులో నుండి 34 సెంటర్లు పనిచేయడం లేదని తెలిపినారు. ఈ చట్ట ప్రకారము ప్రతి స్కానింగ్ సెంటర్లో నిర్వహించవలసిన రిజిస్టర్లు ,పోస్టర్స్, ఫామ్ F ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జడ్జ్ వెంకటేశ్వర్లు సత్యేంద్ర,డీసీపీ వరంగల్, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ , డిప్యూటీ డిఎంహెచ్వోలు, ప్రోగ్రాం అధికారులు,ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్ట్లు ,వైద్యాధికారులు డిప్యూటీ డెమోలు, వైద్య ఆరోగ్యశాఖ సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news