Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అటవీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్

అటవీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు ఉంటాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హెచ్చరించారు. పోడు భూముల సర్వే పై బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర్, జిల్లా అటవీధికారి లావణ్య తో కలిసి సంబంధిత పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికా రులతో రివ్యూ నిర్వహించారు. పోడు భూముల సమస్య పరిష్కా రంలో భాగంగా గ్రామాలలో సర్వే చేపడుతున్న నేపథ్యంలో నూతనం గా అటవీ భూముల ఆక్రమణకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతుందని, దీనిపై అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించా లని ఆక్రమణదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పోడు భూముల సర్వే పై బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర్, జిల్లా అటవీధికారి లావణ్య తో కలిసి సంబంధిత పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికా రులతో రివ్యూ నిర్వహించారు. జిల్లా పరిధిలో 92 గ్రామాల పరిధిలో 174 ఆవాసాలలో ప్రజలు నుంచి 25000 దరఖాస్తులు స్వీకరించా మని, ఇప్పటి వరకు 50% మేర భూ సర్వే పూర్తి చేసామని, నవంబర్ 30 నాటికి 100% పోడు భూముల సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అధిక సంఖ్యలో ప్రజలు ఆటంకం కల్పిస్తున్న నేపథ్యంలో భూ సర్వే నిర్వహణ జరగలేదని జిల్లా అటవీ అధికారి తెలిపారు. 42 ఆవాసాల పరిధిలో పోడు భూముల సర్వేచాలా ఇబ్బం దిగా ఉందని పోడు భూముల పట్టా లు కోసం దరఖాస్తు చేసుకోకుండా కొంత మంది నూతనంగా అటవీ భూమి ఆక్రమణకు పాల్పడుతు న్నారని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భూసర్వే నిర్వహించుటకు రెవెన్యూ శాఖ పోలీసు శాఖల సహకారం కావాలని ఆమె కోరారు.

సమస్యా త్మక 42 ప్రాంతాల లో రెవెన్యూ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు, పోలీస్ అధికారులు, సంయు క్తంగా పర్యటించి సదరు గ్రామ ప్రజలకు నిబంధనల పట్ల అవగా హనకల్పించాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ నూతనంగా అటవీ భూముల ఆక్రమణకు పాల్పడే వారి పై పిడి యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూముల ఆక్రమణకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవ హరిస్తూ కేసులు బుక్ చేసి అవసరమైతే జైలుకు పంపాలని కలెక్టర్ సూచించారు.

RSS
Follow by Email
Latest news