తన భర్త విద్యా సాగర్ మరణంపై సోషల్ మీడియా వేదికగా అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని, వాటిని తక్షణమే నిలిపివేయాలని ఆమె కోరారు. భర్త దూరమయ్యారనే బాధలో నేనుంటే… తనకు అండగా ఉండాల్సిందిపోయి, ఇలానే అసత్య వార్తలను ప్రచారం చేయడం విచారకరం అన్నారు.
మా ఇంటికి సమీపంలో పావురాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చిన కారణంగానే విద్యా సాగర్‌కు శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయని, ఈ క్రమంలోనే ఆయన మరణించారంటూ పలు విధాలుగా వార్తలు వచ్చాయి. వీటిపై మీనా స్పందించారు.
తన భర్త ప్రాణాలను కాపాడేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులు శతవిధాలుగా ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు. కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తన పరిస్థితిని అర్థం చేసుకుని, తన కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించరాదని ఒక ప్రకటనలో మీడియాను ఆమె కోరారు.