Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నేటి నుండి షూటింగ్ లు బంద్… రోడ్డున పడనున్న 26వేల కుటుంబాలు…?

నేటి నుంచి సినిమా షూటింగ్ లను నిలిపి వేస్తున్నామని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ మండలి గిల్డ్ ప్రకటించింది. సినిమా షూటింగ్ లను అకస్మాత్తుగా నిలిపివేయాల్సి పరిస్థితులు తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాయన్న ప్రశ్నకి మాత్రం సరైన సమాధానాలు మాత్రం దొరకడం లేదు. ఈవిషయంపై నిర్మాతలు చెపుతున్న సమాధానాలు నామమాత్రంగానే ఉన్నాయి. కరోనా పాండమిక్ తరువాత తమ ఆదాయ వనరుల్లో మార్పులు వచ్చాయని, ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిందని మాత్రం చెపుతున్నారు. కానీ, ఈ అంశాలు షూటింగ్ ల నిలుపుదలకు ఆమోదయోగ్యాంగా ఉన్నాయా…? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంతే కాదు ఓటీ టీ అంశాన్ని తెరమీదకి తీసుకు వచ్చారు.  సినిమాలు థియోటర్ లో విడుదలైన కొన్ని వరాల తరువాతనే  ఓటీ టీలలో విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

26వేల కుటుంబాల బ్రతుకులు ఏంకావాలి…? 

ఇలా ఒక్కసారిగా షూటింగ్ లను నిలిపివేస్తే… కేవలం ఇదే ఇండస్ట్రీపైనే ఆధారపడి జీవిస్తున్న 26వేల మంది కార్మికుల బ్రతుకులు ఏంకావాలి…? నిజానికి ప్రస్తుత పరిస్థితికి ఇండస్ట్రీ స్వయం కృతాపరాధమని అర్ధం అవుతుంది. తమ ఆదాయ వనరులు తగ్గిపోయాయి, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది అంటున్న నిర్మాతలు అసలు ప్రొడక్షన్ కాస్ట్ పెంచింది ఎవరనే విషయాన్నీ మరచిపోయారు. ఇందుకు కరోనా అంశాన్ని సాకుగా చూపించడం మరి విడ్డురంగా ఉంది.

నష్టాలూ ఎందుకు వస్తున్నాయి…?

గతంలో భారీగానే లాభాలు వచ్చిన ఇండస్ట్రీలో ఉన్నట్టుండి నష్టాలూ ఎందుకు వస్తున్నాయి..? దీనికి కరొనాకు ఏమిటి సంబంధం…? కరోనా కాదు, మరేదో కాదు. ఇది కేవలం వీరి తప్పిదంతోనే అని చెప్పాలి. ఎందుకంటే..? అడ్డు అదుపు లేని బడ్జెట్, ఇతర ప్రాంతాల నుంచి హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, ఇతర సాంకేతిక నిపుణులతో పాటు వర్కర్లను సైతం తీసుకురావడమే ప్రధాన కారణాలుగా కనబడుతున్నాయి. వీటికి తోడు హీరోలకు రెమ్యునరేషన్ అమాంతంగా పెంచడం, మన రాష్ట్రాన్ని కాదని, ఇతర రాష్ట్రాల్లో, అలాగే విదేశాల్లో షూటింగ్ లు చేయడం కూడా వారి బడ్జెట్ పెరుగుదలకు ప్రధాన కారణాలు. వీటిపై దృష్టి పెట్టకుండా సినిమా షూటింగ్ లు  ఆపేస్తే ఎలా..? ఒకరో 100 కోట్ల తో సినిమా తీస్తే, నేను 400 కోట్లతో తీస్తా… అని మరొకరు. ఐదు  వందల  కోట్లతో తీస్తా అని మరొకరు.. ఇలా పోటీ పడి సినిమా  బడ్జెట్ పెంచుకుంటూపోయి ఇప్పుడు నష్టాలూ వస్తున్నాయి అనడం ఎంత వరకు సమంజసమో ఆత్మ విమర్శ చేసుకోవాలి.

థియోటర్ లకు ఆదరణ ఎందుకు తగ్గింది..?

నిత్యం ఏందో టెంషన్ ఉండే ప్రజలు కాస్త రిలీఫ్, వినోదం కోసం థియేటర్ కి వెళ్లి సినిమా చూసే వారు. కానీ కరోనా పాండమిక్ తరువాత పరిస్థితులు అన్ని మారిపోయాయి. చిన్న చితక ఫ్యామిలీలు ఛిద్రమైనాయి. ఉన్న ఉద్యోగాలు పోయి కొందరు రోడ్డున పడ్డారు. అప్పటి వరకు సాధారణంగా ఉన్నటికెట్ల రేట్లను సైతం ఒక్కసారిగా పెంచేశారు. దింతో జనం రావడం తగ్గింది. ఈక్రమంలో బడా హీరోల సినిమాలు సైతం నామమాత్రంగా నడిచాయి. ఆంధ్రప్రదేశ్ లో నిర్దిష్ట ధరలను నిర్ణయించడంతో అక్కడ థియేటర్లలో బాగానే ఆడాయి. కానీ తెలంగాణాలో ధరలను పెంచడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. దీనికి కారణం చిత్ర నిర్మాతలు, దర్శకులు కాదా..?

ఎక్కడివి ఈ ఓటీటీ..?

తమకు నష్టాలు వస్తున్నాయి…. థియేటర్ ఓవిడుదలైన నెలన్నర తరువాత ఓటీటీ లలో రిలీజ్ చేయాలి అంటున్నారు. మరి ఆ వ్యాపారానికి ఆజ్యం పోసింది ఎవరు..? ఆ ఓటీటీలను తీసుకు వచ్చింది, నడిపేది ఎవరు…? అది ఇండస్ట్రీ పెద్దలే కధా …! ఓటీటీలను వ్యాపారం చేసి, ఏడాదికి ఇంత చెల్లించి సబ్ స్క్రిప్షన్ తీసుకునేలా చేసి, ఇప్పుడు నష్టం వస్తుంది అనడంలో ఆంతర్యం ఏమిటో నిర్మాతలే చర్చించుకోవాలి.

నష్టాల నివారణకు చర్యలేవి…? 

సినిమాలు తీసి నష్టపోతున్నాం అని షూటింగ్ లు ఆపేస్తే.. పరిష్కారం దొరుకుతుందా..? అందుకు వారు తీసుకున్న చర్యలు ఏవి..? అగ్ర హీరోల రెమ్యునరేషన్ తగ్గించేందుకు వారితో చర్చలు ఏమైనా జరిపారా…?  సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాతల కోసం ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ గ్రీవెన్ సెల్ ఉంటుంది. అక్కడ వీరి సమస్యకు పరిష్కారం కొరుకుతుంది. ఇంత వరకు ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వాలకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. ఇకపొతే, నష్టాలూ వస్తే… నిర్మాతలను ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రతి రెండేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్లను కేటాయిస్తుంది. 2021 – 22 ఆర్ధిక సంవత్సరంలో రూ.4,071.23 కోట్లను కేటాయించింది.1974 నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. ఇవన్నీ వదిలేసి మాకు నష్టాలూ వస్తున్నాయి మేము సినిమా షూటింగ్ లను ఆపేస్తాం అనడం ఎంత వరకు కరెక్ట్.

షూటింగ్ లు ఆపేస్తే ఎవరికి ఇబ్బంది…?

నష్ట నివారణకు చర్యలు తీసుకోకుండా… సినిమా షూటింగ్ లను ఆపేస్తాం.. అంటే ఎవరికీ ఇబ్బంది. ప్రభుత్వానికా, ప్రజలకా…? కేవలం సినిమా ఇండస్ట్రీ నే నమ్ముకుని బ్రతుకుతున్న 24 క్రాఫ్ట్స్ కార్మికుల పరిస్థితి  ఏమిటి..? ఇండస్ట్రీలో  సుమారు 26 వేల మంది కార్మికులు ఉండగా, సినిమానే తమ జీవనోపాధిగా బ్రతుకుతున్నవారు 13 వేల మంది కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఏమిటి..?  వీరికి పెద్ద దిక్కుగా ఉన్న “మా ”  అసోసియేషన్ మాత్రం స్పదించ లేదు.

బన్న ప్రభాకర్ , సీఎండీ.

ఏపీటీఎస్ బ్రేకింగ్ న్యూస్ 

RSS
Follow by Email
Latest news