పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిపై వైసీపీ బహిష్కరణ వేటు వేసింది. పార్టీ నిబంధనావళిని అతిక్రమించారని పార్టీ క్రమశిక్షణా కమిటీ జగన్‌కు నివేదించింది. . ఈ మేరకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రకటించారు.
2024 ఎన్నికల్లో తాను నరసాపురం నుంచి తప్పనిసరిగా పోటీ చేస్తానని మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఏ పార్టీ తరఫున తాను పోటీ చేస్తానన్న విషయాన్ని మాత్రం చెప్పానన్నారు. దీనిపై పార్టీ క్రమశిక్షణా కమిటీ జగన్‌కు నివేదించింది. విషయాన్నీ పరిశీలించిన జగన్ ఆయనపై వేటు వేశారు.