Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది చాలా దుర్మార్గపు ఘటన. ఆస్పత్రికి తీసుకొచ్చి బంధిస్తారా? రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైంది. ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం ఏపీకే అవమానం. ఆడబిడ్డల విలువ ఈ ప్రభుత్వానికి తెలియదు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు. ప్రభుత్వానిది అహంకారమా? ఉన్మాదమా? సీఎం తన చెంచాలతో మాట్లాడిస్తే భయపడం. ప్రజల పక్షాన పోరాటం చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

RSS
Follow by Email
Latest news