Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రాహుల్‌ను 10 గంట‌ల పాటు విచారించిన ఈడీ అధికారులు

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు సోమవారం నాడు ఏకంగా 10 గంట‌ల పాటు విచారించారు. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ కార్యాలయానికి పిలిపించారు. సోమ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు అయన ఈడీ అధికారుల ఎదుట హాజరైనారు. మధ్యలో ఓ గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత మళ్లీ విచారణ కొనసాగి, రాత్రి 9.30 గంట‌ల‌ వరకు ఈడీ అధికారులు విచారణ కొనసాగించారు. ఆ విధంగా ఏకంగా 10 గంట‌ల పాటు రాహుల్‌ను విచారించారు.

సుదీర్ఘంగా సాగిన‌ విచార‌ణ‌లో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ గాంధీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్లు స‌మాచారం. ఈడీ అధికారులు అడిగిన దాదాపుగా అన్ని ప్ర‌శ్న‌ల‌కు రాహుల్ లిఖిత‌పూర్వ‌కంగానే స‌మాధానాలు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో రాహుల్ స‌మాధానాల‌ను ఆయ‌న వ్య‌క్తిగ‌త సాక్ష్యాలుగా ఈడీ అధికారులు పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇక రేపు కూడా విచార‌ణ‌కు రావాలని రాహుల్ గాంధీకి ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తొలి రోజు విచార‌ణ ముగిసిన స‌మ‌యంలో ఈ మేర‌కు వారు రాహుల్‌కు స‌మ‌న్లు అంద‌జేశారు. దీంతో మంగ‌ళ‌వారం కూడా రాహుల్ గాంధీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కానున్నారు.

RSS
Follow by Email
Latest news