Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అవని, మోనాలను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ

పారిస్ నగరంలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత మహిళా షూటర్ అవని లేఖర స్వర్ణం సాధించింది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని అదరగొట్టింది. 2020 పారా ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో ఈమె ఒక పసిడి, ఒక కాంస్యం సాధించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్ లోనూ ఈ రాజస్థాన్ షూటర్ అంచనాలను అందుకుని భారత కీర్తినిచాటారు.

కాగా, రాజస్థాన్ కే చెందిన మరో మహిళా షూటర్ మోనా అగర్వాల్ కాంస్యం సాధించింది. కాగా, అవని, మోనా అగర్వాల్ లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అవని పారా ఒలింపిక్స్ లో మూడు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ గా చరిత్ర సృష్టించిందని కొనియాడారు. ఆమె అంకితభావం భారత్ గర్వపడేలా చేస్తోందని పేర్కొన్నారు. కాంస్యం సాధించిన మోనా అగర్వాల్ ను కూడా మోదీ అభినందించారు. మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు మోనా చూపిస్తున్న అంకితభావమే  కాంస్య పథకం సాధించగలిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

RSS
Follow by Email
Latest news