దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఎఐసిసి ఆదేశాల మేరకు ఆజాదీకా అమృత్ ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆగస్ట్ 9 నుండి ప్రాదయాత్ర చేపట్టనున్న పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ మేరకు నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, మండల, బ్లాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి, డిసిసి కార్యవర్గ సభ్యులు మరియు ముఖ్య నాయకులతో పాదయాత్ర సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ .. ఈనెల ఆగస్టు 9/2022 క్విట్ ఇండియా రోజును పురస్కరించుకొని, ఉ.10గం.లకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ చౌరస్తా నుండి ప్రారంభమై హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ముగియనుంది. ఆగస్టు 9 నుండి 17 వరకు 125 కిలోమీటర్ల ఈ పాదయాత్ర 7 నియోజక వర్గాలు, 3 జిల్లాల్లో కొనసాగనుందని అయన వివరించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో నెలకొన్న ప్రజా సమస్యలను తెలుసుకోవడం మరియు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయడంలో భాగంగా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు.
కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, పాలన వైఫల్యాలను ఎండగట్టడం, దేశంలో ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు వివరిస్తూ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఆగస్టు 9 నుండి 17 వరకు 125 కిలోమీటర్ల పాటు చేపట్టనున్న ఇట్టి పాదయాత్రలో ఆయా నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ లు, ముఖ్య నేతలు, నాయకులు పార్టీ శ్రేణులు, రైతులు, అభిమానులతో పాటు పొన్నం ప్రభాకర్ సానుభూతిపరులు పాల్గొననున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గస్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మరియు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీ పటిష్టత కోసం చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తవుతున్నాయి. ఈ సమావేశంలో ఈ సమావేశంలో నాయకులు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, బ ల్మూరు వెంకట్, నాగుల సత్యనారాయణ గౌడ్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి , మండల/ బ్లాక్/ నగర/ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతోపాటు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజక వర్గాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.