వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 7న హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి లో పాల్గొనాలనుకున్నారు. అయితే రాహుల్ ని ఓయూ లో అడుగు పెట్టనీయమని టీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ ఎస్ యూ ఐ నాయకులు కూడా ఛాలెంజ్ గా తీసుకోవడం, పోటీగా ఆందోళనలకు దిగడంతో ఓయూ లో పరితితులు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ కి అనుమతి ఇవొద్దంటూ…టీఆర్ఎస్వీ నాయకులు ఓయూ వీసీకి మెమోరాండం ఇచ్చారు. ప్రతిగా అనుమతి ఇవ్వాలంటూ… ఎన్ ఎస్ యూ ఐ నాయకులు లేఖలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ పర్యటనకు ఓయూ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ నెల 7న విద్యార్థులతో ముఖాముఖికి అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో మానవతారాయ్ సహా నలుగురు పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఈ హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరపాలని వారు కోరారు.