కళ్యాణ లక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సితక్క తెలిపారు. మంగళవారం రోజున మండల కేంద్రంలో గల రెవెన్యూ ఆఫీస్ లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజలందరూ కళ్యాణలక్మి పథకాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సంబశివరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పైడకుల అశోక్, మండల అధ్యక్షులు జయరామ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆక రాధాకృష్ణ, మండల రచ్చబండ కష్టర్లు పూజారి సురేందర్, బాబు తదితరులు పాల్గొన్నారు.
