నేడు అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అనంతపురం నుండి కౌలు రైతుల భరోసాయాత్ర చేస్తారు. జిల్లాలోని కొత్తచెరువు నుంచి రైతుల భరోసాయాత్రను పవన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించనున్నారు. అనంతరం రైతుల కుటుంబాలతో మాట్లాడుతారని జనసేన నేతలు తెలిపారు. గ్రామ సభ అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.
