జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ పార్టీ కి చెందిన వీరమహిళలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రజల పక్షాన నిలబడి బలంగా తమ గళాన్ని వినిపించిన జనసేన వీరమహిళలను పవన్ కల్యాణ్ ఘనంగా సత్కరించారు. అలాగే వారినిపేరుపేరునా పిలిచి అభినందించారు. కోనసీమ ప్రాంతంలో ఇటీవల వచ్చిన వరదల్లో నష్టపోయిన వరద బాధితుల కోసం సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించిన వారి కృషిని ప్రశంసిస్తూ శాలువాలు కప్పి జ్ఞాపికలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జనసేన భవిష్య కార్యాచరణపై పవన్ వారితో చర్చించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల తరఫున మరింత బలమైన పోరాటాలు చేయాలని వారికి ఉద్బోధించారు.
