కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఓఆర్ఆర్ ఉనికిచర్ల దగ్గర చేపట్టిన ప్లాట్ల వేలం పాటలో పాల్గొని విజయవంతం చేయాలని కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ కోరారు. శనివారం రోజున ఉనికిచర్లలో కుడా చేపట్టిన యుని సిటీ వేలంపాట పనులను వైస్ చైర్మన్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ధరలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్లాట్లను నగర ప్రజలకు అందించడం జరుగుతుందని వివరించారు. యుని సిటీలో వాస్తు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఇతర అత్యున్నత వసతులతో ప్లాట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. కుడా ఏర్పాటుచేసిన ఈ ప్లాట్లు వివిధ రంగాల్లో పనిచేస్తున్న వినియోగదారులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటాయని, తక్కువ ధరలో సైతం లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో పీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, జేపీఓ శంకర్, కుడా సిబ్బంది పాల్గొన్నారు.
