Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆరోపణలు చేయడం కాదు… భూపాల‌ప‌ల్లికి వచ్చి రైతుల‌ను అడగాలి

తెలంగాణ  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో శైలిలో బిజెపి , కాంగ్రెస్ పార్టీల ఫై విరుచుకుపడ్డారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉంద‌ని విమ‌ర్శించారు. కర్ణాటక ముఖ్య‌మంత్రి పదవికి రూ. 2,500 కోట్లు ఇస్తే వస్తద‌ట‌.. ఇది మనం లేదు. సాక్షాతూ  కర్ణాటక బీజేపీ ఎంపీనే చెప్తున్న మాటలు అని హ‌రీశ్‌ తెలిపారు. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో రూ. 102 కోట్లతో చేప‌ట్టిన ప‌లు ప‌నుల‌కు సోమవారం నాడు మంత్రి హ‌రీశ్‌రావు శంకుస్థాపనలు, చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయ‌ని అన్నారు. ఓటుకు నోటు కేసులో ముద్దాయి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఇలాంటి పార్టీల‌తో తెలంగాణ అభివృద్ధి జ‌రుగుతుందా? అని మంత్రి ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి మీరే హై కమాండ్. మీరు ఏది కోరుకుంటే అది చేసే పార్టీ. టీఆర్ఎస్ లేకపోతే, సీఎం గా కేసీఆర్ లేకపోతే భూపాల‌ప‌ల్లి జిల్లా అయ్యేదా..? భూపాలపల్లికి మెడికల్ కాలేజీ వచ్చేదా..? అని ప్రశ్నించారు.

అలాగే కాళేశ్వ‌రం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డాపై హ‌రీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవ‌రో రాసిచ్చిన స్క్రిప్టును న‌డ్డా చ‌దివారని ఆరోపించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో ఒక్క ఎక‌రానికి కూడా నీరు పార‌లేద‌ని అనడం అయన విజ్ఞతకే వదిలేస్తున్నాని అన్నారు. అయితే ఎక్కడో ఉంది ఆరోపణలు చేయడం కాదు,  భూపాల‌ప‌ల్లికి వచ్చి రైతుల‌ను అడిగితే నీళ్లు వ‌చ్చాయా? లేదా? అన్న‌ది తెలుస్తుంద‌న్నారు.  ఆనాడు నీళ్ల కోసం రైతులు త‌మ క‌ళ్ల‌ల్లో వ‌త్తులేసుకుని ఎదురు చూస్తే.. నేడు నీరు చాలు, ఆపాల‌ని రైతులు కోరుతున్నార‌ని హ‌రీశ్‌రావు అన్నారు.

RSS
Follow by Email
Latest news