గత పదిహేను రోజుల తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ అతి వర్షాల విరామం తర్వాత రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శుక్ర, శనివారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. “వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో రెండు, మూడు రోజుల్లో అది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్ ఘఢ్ వైపు వెళ్లే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు ఆదిలాబాద్, కుమురంభీమ్-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి” అని వాతావరణ శాఖ పేర్కొంది.
