Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆమె పాటకు అక్షరాలా 4 కోట్ల 50 లక్షలు…!

ఆమె పాటకు అక్షరాలా 4 కోట్ల 50 లక్షలు అంటే నమ్మలేకపోతున్నారా…? కానీ ఇది అక్షరాలా నిజం. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా… ఆమె పేరు గీతా రాబరి. గుజరాత్‌ రాన్న్ ఆఫ్ కచ్‌లో రాత్రంతా గీత రాబరి భజన కార్యక్రమం కొనసాగింది. రాత్రంతా ఆమె పాటలు పాడుతూనే ఉంది.. ఇక ఆ స్టేజీపై నోట్ల వర్షం కురిసింది. పదులు, వందలు కాదు  ఏకంగా 4 కోట్ల 50 లక్షల రూపాయలను కుమ్మరించారు. దింతో ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాందేవి మాత పునర్జన్మను పురస్కరించుకుని గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలో నవచండీ యజ్ఞం జరిపించారు.. ఈసందర్బంగా  గీతా రాబరితో సంగీత భజన కార్యక్రమం నిర్వహించారు. గాన కోకిల గా పేరున్న గీత రాబరి భజన కార్యక్రమాన్ని తిలకించేందుకు  ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గుజరాతీ భాషలో ఆమె పాడిన ఎన్నో పాటలు వైరల్ అయ్యాయి.

గీతా రాబరి కెరియర్ :

గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని తప్పర్ గ్రామంలో మధ్య తరగతి కుటుంభంలో గీతా రాబరి జన్మించారు. ఆమె అసలు పేరు గీతా బెన్ రాబరి. ఆమె 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పాటలు పాడటం ప్రారంభించారు. ఆమె స్వరం మాధుర్యమైనదని చుట్టుపక్కల గ్రామస్థులు అకేషన్ కి ఆమెతో పాటలు పండించుకునే వారు. తొలుత జానపదాలు, భజనలు, స్వాంత,దియారా  పడుతూ ఉండేది. 10 తరగతి వరకే ఆమె విద్యాభ్యాసం కొనసాగింది. 31 డిసెంబర్ 1996 ప్రస్తుతం (2023 ఏప్రిల్ నాటికీ ) ఆమె వయస్సు 26 సంవత్సరాల 4నెలలు. గుజరాతీ భాషలో ఆమె పాడిన ఎన్నో పాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడే కాదు.. ఆమె ఎక్కడ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నా.. ఆమెపై నోట్ల వర్షం కురిపిస్తారు అక్కడి ప్రజలు. ఆమె పాటలకు ఎంత క్రేజ్‌ ఉందో వేరేగా చెప్పనక్కర్లేదు. ఆమె పాటలు వింటుంటే.. ప్రపంచాన్ని మర్చిపోతామని అభిమానులు చెబుతుంటారు.

Latest news