డిజిటల్‌యుగంలో జర్నలిస్టులు కూడా అప్డేట్కావాల్సిన అవసరం ఉన్నదని ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగపు హెచ్‌వోడీ, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ మెంట్ సెంటర్ డైరెక్టర్ ప్రో కె స్టీవెన్సన్ పేర్కొన్నారు.
శనివారం హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ సీఎఫ్ఆర్డీ బిల్డింగ్‌లో ‘‘జర్నలిజం ఇన్ ది డిజిటల్ ఏజ్’’ అనే టాఫిక్ పై సెమినార్ నిర్వహించారు. వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు హజరయ్యారు.
ఈ సందర్భంగా స్టీవెన్సన్ మాట్లాడుతూ…కాలానుగుణంగా జర్నలిజం వృత్తిలో అనేక మార్పులు వచ్చాయన్నారు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని పత్రికలు, ఛానళ్లు ముందుకు నడుస్తున్నాయన్నారు. డిజిటల్ ఫార్మాట్‌కు ప్రాధాన్యత పెరిగిందన్నారు. జర్నలిస్టులు కూడా ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. అప్పుడే కాంపిటేషన్రంగంలో సులువుగా ముందుకు వెళ్లగలుగుతామన్నారు. అయితే ఇన్వేస్టిగేషన్ పాత్ర కూడా పెరగాలన్నారు. గతంలో పోల్చితే ప్రస్తుత జర్నలిజం వృత్తిలో అది కాస్త తగ్గిందన్నారు. మళ్లీ కొత్త తరంతో మార్పులు రావాలన్నారు. సమాజ మార్పుకు కృషి చేయాలన్నారు.ప్రజల నిత్య జీవితంలో ముడిపడిన అంశాలపై రీసెర్చ్చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో హెచ్ యూ జే అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్, టీ డబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పి.ఆనందం, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగవాణి, ట్రెజరర్ రాజశేఖర్, ప్రతినిధులు నవీన్, రమేష్, గుడిగ రఘు, బీ వి ఎన్ పద్మరాజు, రామకృష్ణ, కె నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.