Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఇంగ్లండ్‌ క్రికెట్‌ కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌

ఇంగ్లండ్‌ నూతన కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌ ఎంపికయ్యాడు.  జూన్‌ 28న ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి ఇయాన్‌ మోర్గాన్‌ తప్పుకోవడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఇవాళ (జూన్‌ 30) బట్లర్‌ను కొత్త సారధిగా ప్రకటించింది. బట్లర్‌ ప్రస్తుతం జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. తాను కెప్టెన్ గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…ఈసీబీకి అలాగే మాజీ సారధి మోర్గాన్‌ కు ముందుగా ధన్యవాదాలు తెలూపుకుంటున్నాను అన్నాడు. మోర్గాన్‌ నుంచి బాధ్యతలు చేపట్టడం గొప్ప గౌరవమని అన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇంగ్లండ్‌ తరఫున 57 టెస్ట్‌లు, 151 వన్డేలు, 88 టీ20 ఆడిన బట్లర్‌ తొమ్మిది వేలకు పైగా పరుగులు సాధించాడు. అందులో మొత్తం 13 సెంచరీలు, 54 హాఫ్‌ సెంచరీలు సాధించాడు.

RSS
Follow by Email
Latest news