Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

భారత్ పై కీలక ఆరోపణలు చేసిన జపాన్

రష్యా , ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తాము చేసిన ప్రతిపాదనలకు భారత్ అంగీకరించలేదని పేర్కొంది. ఆసమయంలో ఉక్రెయిన్ ప్రజలకు సహాయం చేద్దామని, మానవీయ కోణంలో తాము భావించామని, అయితే, తమ విమానాన్ని భారత్ లో ల్యాండ్ చేద్దామని భారత ప్రభుత్వాన్ని కోరామని, జ‌పాన్ అధికార పార్టీ లిబ‌ర‌ల్ డెమోక్రెటిక్ తెలిపింది. కానీ ఆసమయంలో తమ అభ్యర్థనని భాతర ప్రభుత్వం అంగీకరించలేదని ఆరోపించింది. ఈ రిపోర్టును నిక్కేయీ ఏసియా అన్న మీడియా హౌజ్ పేర్కొంది. ఉక్రెయిన్ ప్రజల అవసరాలకు సంబందించిన వాటిని భారత్ లో లోడ్ చేసుకుని పోలాండ్,రోమానియా మీదుగా ఉక్రెయిన్ కు సరఫరా చేయాలనీ తాము భావించామని జపాన్ తెలిపింది. అయితే…భారత విదేశాంగ శాఖ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన కానీ, అనుమతి కానీ ఇవ్వలేదని జపాన్ ఆరోపించినట్లు ఆ మీడియా పేర్కొంది.

RSS
Follow by Email
Latest news