Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుగా ఉంది : ఈటల

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే… కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. చౌటుప్పల్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఈరోజు ఈటల పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్థానిక బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని… ఈయన జాతీయ స్థాయికి వెళ్లి చేసేదేముందని ప్రశ్నించారు.

అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణను కేసీఆర్ మార్చారని దుయ్యబట్టారు. దేశంలో, రాష్ట్రంలో కేసీఆర్ ఒక చెల్లని రూపాయిగా మారిపోయారని అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ఈటల ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం నిర్మాణాన్ని పూర్తి చేయాలని అన్నారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన హామీలను కేసీఆర్ ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు.

Latest news