టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. లోకేశ్ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. లోకేష్ పాదయాత్ర సందర్భంగా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. దాదాపు 200 మంది బౌన్సర్లు, 400 మంది వాలంటీర్లను నియమించారు. అలాగే భోజనం, బహిరంగసభలు, వసతి ఏర్పాట్లకు సంబంచి ప్రత్యక కార్యాచరణ రూపొందించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మోడల్ గా తీసుకుని యువగళం యాత్రను ప్లాన్ చేసినట్లు సమాచారం.
