Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూత

ఆదరణ సేవాసమితి ఎన్జీవో ఆధ్వర్యంలో కరీంనగర్ మండలం జూబ్లీ నగర్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు స్టేషనరీ కిట్ పంపిణీ ఈరోజు చేశారు. కరోనా పట్ల అలాగే, ఫైనల్ ఎగ్జామ్స్ పట్ల విద్యార్థులకున్న భయాన్ని పోగెట్టేలా వారికి అవగాహన కల్పించారు. ఈ  సందర్బంగా విద్యార్థులకు  ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్లను పావని  పంపిణీ చేశారు. అనంతరం సంస్థ అధ్యక్షురాలు కర్రె పావని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు  ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా అన్ని రకాల ప్రతిభను కలిగిఉన్నారని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ముందంజలో ఉన్నారని అటువంటి వారికి  ప్రోత్సాహ కారకంగా మా సంస్థ నుండి స్టేషనరీ కిట్ అందించడం చాలా సంతోషమని పావని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వకులబరణం పద్మ గారు మాట్లాడుతూ ఆదరణ సేవా సమితి చేస్తున్నటువంటి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రవి, సింగం సరోజ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news