రెండు తెలుగు రాష్ట్రాలు తడిసి ముదైపోతున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. నేడు కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదేరాబద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే, మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
