Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు…

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలంగాణలో నేటి నుండి మూడు రోజుల పాటు  భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని, పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ప్రజలంతా  జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షాల కారణంగా గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల  వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.

తెలంగాణలోని వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ అర్బన్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. నారాయణపేట్, మహబూబ్ నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.

RSS
Follow by Email
Latest news