Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్…

కళ్ళలో కారం పొడి చల్లీ దారి దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను మట్టెవాడ సీసీఎస్ పోలీసులు  మంగళారం నాడు చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోష్ మాట్లాడుతూ…నిందితులు జల్సాలకు అలవాటుపడి దారి దోపిడీలకు పాల్పడుతున్నారని వివరించారు.

నిందితుల వివరాలు:

1.వజ్ర వీరేందర్ S/o బాబు రావు, వ: 30 సo:లు, కులం: ఆరే, వృతి: TATA ACE డ్రైవర్, R/o SR నగర్, కోటి లింగాల గుడి దగ్గర, వరంగల్.
2.బాణాల నరేష్ @ గుడ్డు S/o రాజలింగం, వ:23 సo:లు, కులం: దక్కలి, వృత్తి: హమాలి, R/o క్రిస్టియన్ కాలనీ, వరంగల్.
3.Md. యాకుబ్ పాషా S/o యౌసుఫ్, వ: 34 సo:లు, ముస్లిం, వృత్తి: హమాలి, R/o కీర్తినగర్, వరంగల్.
4.ఆడెపు రాజేష్ S/o రమేష్, వ: 27 సo:లు, కులం: పద్మశాలి, వృతి:సెంట్రింగ్ పని, SR నగర్, కోటి లింగాల గుడి దగ్గర, వరంగల్.
5.గడ్డం రాజేష్ S/o ప్రభాకర్, వ: 35 సo:లు, కులం: మున్నురుకపు, వృత్తి: హమాలి, R/o విశ్వకర్మ స్ట్రీట్, కాశిబుగ్గ, వరంగల్.

ప్రధాన నిందితుడు వజ్ర వీరేందర్ గత 7 సంవత్సరాల నుండి టాటా ఏసీఈ ట్రాలీ ఆటో కిరాయికి వెళుతుంది వాడు. వరంగల్ నర్సంపేట రోడ్ లోని మహలక్ష్మి ఐరన్ షాప్ నుండి కస్టమర్లు కొనుక్కువెళ్లే ఐరన్ ను తన ట్రాలీ ఆటో లో  చేరవేస్తూ ఉండేవాడు.తన షాప్ ఓనర్ తొ నమ్మకంగా ఉంటునట్టు నటిస్తూ…తాను కూడా తన ఓనర్ లాగా  బ్రతకాలని, ఓపథకం పన్నాడు. ప్రతి రోజు మహలక్ష్మి ఐరన్ షాప్ లో జరిగే లావాదేవి లను, ఇరన్ షాప్ ఓనర్, తన కొడుకు ఇద్దరు రాత్రి పూట షాప్ క్లోజ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళేది గమనుస్తూ ఎలాగైనా అట్టి డబ్బులు తన స్నేహితులతో కలిసి లాక్కోవాలని ప్లాన్ అనుకొన్నాడు.

అనుకున్నదే తడువుగా తన స్నేహితులైన ఆడెపు రాజేష్, గడ్డం రాజేష్, Md. యాకుబ్ పాషా, బాణాల నరేష్ లను కలిసి ఈ ఐదుగురు నిందితులు ఓక ముఠాగా ఏర్పడి వ్యూహ రచన చేశారు. తదనంతరం 10 రోజుల క్రితం నుండి  4,5 సార్లు దోపిడీకి ప్రయత్నం చేసినారు కాని సక్సస్ కాలేక పోయినారు. ఆ తర్వాత తేది: 23-04-2022 రోజున మధ్యాహ్నం నిందితులు అందరు ఏనుమాముల మార్కెట్ వద్ద కలుసుకొని మద్యం త్రాగుతూ నేరం చేయడానిని పక్క స్కెచ్ వేసుకొన్నారు.

బాదితుల యొక్క కదలికలను గమనిస్తూ వీరేందర్ ఫోన్ ద్వార తెలుపాలని, గడ్డం రాజేష్ పల్సర్ వెహికల్ నడపాలి, ఆడెపు రాజేష్ ఇంకో వెహికల్ మీద వెళ్లి బాదితుని ఇంటి దగ్గర గల్లిలో బాదితులను గమనిస్తూ ఉండాలని, ఆడెపు రాజేష్ యాకుబ్ దగ్గరకు వెళ్లి కారం పొడి తో రడిగా ఉండాలి, బాదితుడు రాగానే ఆడెపు రాజేష్ బదితుడి ముఖం మిద కారంపొడి చల్లాలని ప్లాన్ వేసుకొన్నారు.

సుమారు సాయంత్రం 7 గంటలకు బాదితుడు షాప్ నుండి తన కొడుకు తో పాటు డబ్బులు బ్యాగ్ లో పెట్టుకొని బయలు దేరిడినది చూసి వీరేందర్ బాదితుడు ఇంటివైపు వస్తున్నది ఫోన్ లో యాకూబ్ కు, రాజేష్ కు నరేష్ కు చెప్పిగా బాదితుడు తన ఇంటికి సమీపంలో కి రాగానే గడ్డం రాజేష్, నరేష్ లు బండికి ఎదురువెళ్ళి బాదితుల కంట్లో కారం చల్లి డబ్బుల బ్యాగ్ లాక్కొన్నారు. బాదితుడు అరవడంతో చుట్టుపక్కల వారు వస్తున్నది గమనించి యాకుబ్, ఆడెపు రాజేష్ లు అక్కడినుండి బండి మీద వెంటనే పారిపొయినారు.

గడ్డం రాజేష్, నరేష్ ఇద్దరు పల్సర్ వెహికల్ పై వెళ్తూ అక్కడే వెహికల్ ఆగిపోవడంతో పల్సర్ వెహికల్ వదిలేసి డబ్బులతో పారిపోఇనారు. తర్వాత నిందితులు అయిదుగురు దేశాయిపెటలో కలుసుకొని మద్యం త్రాగిన తర్వాత వీరేందర్ ఇంటికి వెళ్లి డబ్బులను వీరేందర్ ఇంట్లో ఎవరికీ కనపడకుండా దాచిపెట్టి ఎవరి ఇంటికి వారు వెల్లిపోయారు. 

ఇట్టి విషయమై మట్టేవాడ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు కాగా గౌరవ వరంగల్ పోలీస్ కమీషనర్ డా. తరుణ్ జోషి. IPS గారి సూచనల మేరకు, సెంట్రల్ జోన్ DCP అశోక్ కుమార్, అడిషనల్ DCP క్రైమ్స్ & ఆపరేషన్స్ K. పుష్ప గార్ల పైర్యవేక్షణలో క్రైమ్ ACP P.డేవిడ్ రాజు, వరంగల్ ACP కల్కోట గిరి కుమార్ గార్ల అదేశానుసరంగా CCS ఇన్స్పెక్టర్ L. రమేష్ కుమార్, మాట్వాడ ఇన్స్పెక్టర్ Ch. రమేష్ మరియు క్రైమ్ టీమ్స్ రంగంలోకి ఐజి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి

స్వాధీనము చేసుకొన్న సొత్తు వివరాలు…

నగదు రూ. 9,89,370/-
నేరం చేయడంలో ఉపయోగించిన నిందితులకు సంబందించినవి
ఒక పల్సర్ మోటార్ సైకిల్ No. TS 03 EF 1522
ఒక గ్లామర్ మోటార్ సైకిల్ No. AP 36 AP 5265
ఒక హోండా HF డిలక్స్ మోటార్ సైకిల్ నంబెర్ లేనిది
ఇదు మొబైల్స్..

స్వాధీనం చేసుకున్నట్లు కమీషనర్ వివరించారు. నిండీయూలను కోర్టులు హాజరు పరుచనున్నటు సీపీ తెలిపారు.

RSS
Follow by Email
Latest news